Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యావాలంటీర్లను 2021-22 విద్యాసంవత్సరంలో రెన్యూవల్ చేయాలని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం (టీవీవీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్లో తా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మఠం శివానందస్వామి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు 30 శాతం ఫిట్మెంట్ను వర్తింపచేయాలని కోరారు. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైతే విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.