Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో, విదేశాలలో ఉన్నట్టు సీబీడీటీ వెల్లడి
- ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం
న్యూఢిల్లీ : భారత్‌లో, విదేశాలలో మొత్తం రూ. 20,078 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) వెల్లడించింది. జూన్ నాటికి ఈ మొత్తాన్ని గుర్తించినట్టు వివరించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన ప్రశ్నకు సమాధానంగా సీబీడీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. పనామా పేపర్స్‌లో ప్రపంచ భాగస్వామి. ఇది పనామేనియన్ లా సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి పొందిన సుమారు 11.5 మిలియన్ రహస్య పత్రాల నుంచి సేకరించిన ఆఫ్‌షోర్ హౌల్డింగ్స్పై దృష్టి పెట్టింది. వంద మంది మీడియా భాగస్వాములతో కూడిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) చేత దర్యాప్తు చేయబడిన విషయాలు భారత్‌లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2016 ఏప్రిల్‌లో ప్రచురించిన విషయ విదితమే. ఆర్టీఐ ద్వారా సీబీడీటీ గతంలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు విడుదల చేసిన గణాంకాలు 2019 జూన్‌లో రూ. 1564 కోట్లు, 2018 ఏప్రిల్‌లో రూ. 1088 కోట్లు గా ఉండటం గమనార్హం.