Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏని రద్దు చేసినా..ఈ సెక్షన్ కింద పలు రాష్ట్రాల్లో పోలీసులు కేసులు నమోదు చేయ టంపై సర్వో న్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏని ఆరేండ్లక్రితమే సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయట మేంటని సుప్రీం ప్రశ్నిం చింది. ఇది తమను షాక్‌కు గురిచేసిందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సమాధానమివ్వా లంటూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది.
2015 లో సుప్రీం కోర్టు చారిత్రాత్మక నిర్ణయం
ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ఎను 2015 మార్చి 24 న రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది.
సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసినవారిని సెక్షన్66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకా రం..నిందితులకు మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రా ల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విచారణ సందర్భంగా సెక్షన్66 ఎ చట్టం అస్పష్టంగా ఉండటమే కాదు..ఇది రాజ్యాంగ విరుద్ధమనీ, వాక్ స్వాతంత్య్ర హక్కును ఉల్లంఘిస్తున్నదని కోర్టు అభిప్రాయపడింది.ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అక్రమంగా కేసుల బనాయింపు
2015 లో సెక్షన్ 66 ఎ రద్దు చేసేటపుడు 229 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఆ చట్టాలను రద్దు చేసినా కొత్తగా 1307 కేసులు నమోదయ్యాయి. వీటిలో 570 ఇంకా పెండింగ్‌లో ఉండగా, 2019 లో 66 ఎ రద్దు చేయాలన్న ఉత్తర్వు కాపీని సంబంధిత హైకోర్టు ద్వారా ప్రతి జిల్లా కోర్టుకు పంపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదేశాల కాపీని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకూ పంపాలని పేర్కొన్నది. ఈ సమాచారాన్ని ప్రతి పోలీస్ స్టేషన్‌కు కూడా అందేలా చూడాలన్నది. కానీ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చా క..ఇప్పటికీ ఈ ఆదేశాలు అమలుకావటంలేదు. రద్దు చేసిన చట్టాలను ప్రయో గించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది సంజరు పరిఖ్ వివరించారు.
సుప్రీంను ఆశ్రయించిన పీయూసీఎల్
సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పలు చోట్ల పోలీసులు సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అనే ఎన్జీవో సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయి ంచింది. ఈ సెక్షన్‌కింద గత ఆరేండ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయనీ, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఆర్ఎఫ్.నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం..తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.