Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమే బాధ్యత వహించాలి : కార్యకర్తలు
- సంతాపం ప్రకటించిన ప్రముఖులు
- బాద్యులను కటినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం)
ముంబయి: ఉద్యమకారుడు, ఆదివాసీల గొంతుక, సామాజిక హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ముంబయి లోని హౌలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తు న్నారు. ఆదివారం నుంచి వెంటిలెటర్‌పై శ్వాస తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.
భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన స్టాన్ స్వామి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయిం చారు. విచారణ ఇంకా ప్రారంభంకాక ముందే ఆయన మరణించారు. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న స్టాన్ స్వామి అస్వస్థతకు గురి కావడంతో మే 28న కోర్టు ఆదేశాలతో హౌలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అంతకు ముందు జైలు అధికారులు తనకు సరైన చికిత్సను అందించడం లేదంటూ స్వామి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, స్వామి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
ఆదివాసీల గొంతుకై..
తమిళనాడు తిరుచిరాపల్లిలో జన్మించిన స్టాన్ స్వామి హక్కుల పోరాట కార్యకర్తగా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. వ్యవసాయ కుటుం బంలో జన్మించిన ఆయన వెనుకబడిన, దళిత వర్గాల ప్రజల కోసం బెంగుళూరులో ఒక పాఠశాలను నడిపారు. 1991లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడికి చేరుకుని ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించారు. మావోయిస్టులుగా ముద్రపడి జైళ్లలో మగ్గుతున్న దాదాపు 3 వేలమంది ఆదివాసీల కోసం న్యాయస్థానంలో పోరాడారు. ఆదివాసీలకు తమ హక్కులేంటో వారికి గ్రామాలకు వెళ్లి వివరిం చేవారు.
వాళ్లకు తెలియకుండా, పరిహారం ఇవ్వకుం డా వారి భూములను డ్యామ్‌లు, పరిశ్రమల కోసం ఎలా ఆక్రమించుకుంటున్నారో వివరించేవారు. కాగా, 2017 డిసెంబర్ 31న పుణేలో జరిగిన ఓ సమావేశంలో స్టాన్ స్వామి చేసిన వ్యాఖ్యలు మరు సటి రోజు భీమా కోరెేగావ్ యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో జరిగిన రైతుల ధర్నా హింసాత్మకం కావడానికి కారణమని స్టాన్ స్వామి సహా పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసు కున్నారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు.