Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డునపడ్డ కుటుంబాలు..
- కరిగిపోతున్న డిపాజిట్లు : ఎస్బీఐ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న మందగమనానికి తోడు కరోనా సంక్షోభం ఆజ్యం పోయడంతో అనేక కుటుంబాలపై అప్పుల భారం పెరిగి పోతుంది. బ్యాంక్‌ల్లోని ప్రజల డిపాజిట్లు తరలిపోతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అనేక కుటుంబాలు బ్యాంకింగ్, ఇతర విత్త సంస్థల నుంచి రిటైల్, పంట, వ్యాపార రుణాలు తీసుకుంటున్నాయని.. ఇది ప్రజలపై అప్పుల భారం పెరగడానికి సంకేతమని ఆందోళన వ్యక్తం చేసింది.
2019-20లో జీడీపీలో అప్పుల నిష్పత్తి 32.5 శాతంగా ఉండగా.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో 37.3 శాతానికి చేరిందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇదే సమయంలో బ్యాంక్‌ల్లోని డిపాజిట్లు తగ్గాయని తెలిపింది. వైద్య ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. 2021-22 కుటుంబాల అప్పులు మరింత పెరుగొచ్చని.. ఇది వారి ఆర్థిక పరిస్థితులను మరింత బలహీ నం చేయొచ్చని హెచ్చరించింది. కాగా.. జూన్‌లో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కొంత పుంజుకున్నాయని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. వ్యాక్సిన్ ప్రక్రియను వేగ వంతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగతి వేగవంతం కానుందని పేర్కొంది. కరోనా, లాక్డౌన్ నిబంధనలతో అనేక మంది ఉపాధి దెబ్బతిన్నది. దీంతో అనేక మంది అవకాశం ఉన్న చోట అధిక వడ్డీలకు అయినా అప్పుల చేశారని నిపుణులు పేర్కొంటున్నారు. ఉపాధిని మెరుపర్చడంలో మోడీ ప్రభుత్వం చర్యలు అత్యంత బలహీనంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం ఎగిసి పడటం ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. దీంతో అవసరాలను తీర్చుకోవడా నికి అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసా గితే దేశప్రజలపరిస్థితి అత్యంతప్రమాదంలోకి జారుకోనున్నదని హెచ్చరిస్తున్నారు.