Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లచట్టాలను రద్దు చేయాల్సిందే
- హర్యానాలో భారీ రైతు సభ
న్యూఢిల్లీ: నల్లచట్టాలను రద్దుచేసేదాక పోరు ఆగదని రైతునేతలు స్పష్టం చేశారు.హర్యానాలోని సిర్సాలో జరిగిన భారీ రైతు ర్యాలీలో ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. మోడీ విధానాలవల్ల రైతుల బతుకులు దుర్భరంగా మారాయని ఆరోపించారు.ఇక ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం మంగళవారానికి 222వ రోజుకు చేరింది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం కొనసాగుతుంది. అన్ని సరిహద్దుల వద్ద రైతుల ఉద్యమానికి స్థానిక మద్దతు బలంగా ఉన్నదని రైతునేతలు వివరించారు.