Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మంది ఎంపీలకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: లక్షద్వీప్ సందర్శించటానికి ఎనిమిది మంది ఎల్డీఎఫ్ ఎంపీలకు అనుమతి దక్కలేదు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ వారి పర్యటనకు నిరాకరించింది. ఎల్డీఎఫ్ ఎంపీలైన ఎలమారం కరీం, వి.శివదాసన్, ఎఎం ఆరీఫ్, బినోరు విశ్వం, ఎంవి శ్రేయమ్స్ కుమార్, కె.సోమప్రసాద్, థామస్ చాజికాదన్ లు లక్షద్వీప్ సందర్శనకు అనుమతించాలని చేసు కున్న దరఖాస్తును లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ తిరస్కరించింది. కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ ద్వీపానికి చెందని వారు ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. తాము లక్షద్వీప్ లో పర్యటనకు అడ్మిని స్ట్రేషన్ నో చెప్పిందనీ, దీనిపై ఎనిమిది మంది ఎంపీలు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ కూడా రాశారు.