Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభ ధర రూ.64.12 లక్షలు
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్ఆర్) మంగళవారం భారత మార్కెట్లోకి న్యూ రేంజ్ రోవర్ ఏఓక్యును విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ. రూ.64.12 లక్షలుగా నిర్ణయించింది. పాత మోడల్ ఎఓక్యుతో పోలిస్తే ఆధునిక వేరియంట్ కారు ధర రూ.5.08 లక్షలు ఎక్కువ. ఎఓక్యు డీజిల్ వేరియంట్ కారు 8.5 సెకన్లలోనూ 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. గంటకు ఈ మోడల్ కారు గరిష్ఠ వేగం 213 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపింది. పెట్రోల్ వేరియంట్ 7.60 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని వెల్లడించింది. కొత్త వర్షన్ కార్లపై ఆసక్తి గల కొనుగోలుదారులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది.