Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతికి 10 ప్రతిపక్షపార్టీల నేతల లేఖ
న్యూఢిల్లీ : గిరిజన హక్కుల ఉద్యమవేత్త, ఫాదర్ స్టాన్ స్వామి హత్యకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 10 మంది ప్రతిపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. భీమా కొరేగావ్ కేసులో నిర్భంధించి ఉన్న ఉద్యమకారుల్ని విడుదల చేయాలని రాష్ట్రపతిని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రపతికి లేఖ రాసినవారిలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్పీపీ చీఫ్ శరద్ పవార్, జేడీఎస్ నాయకులు దేవగౌడ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఉన్నారు. స్టాన్‌స్వామి మరణంపై 'తీవ్ర వేదన', 'తీవ్ర దుఖం', 'ఆవేదన'ను వ్యక్తం చేయడానికి లేఖ రాస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. జైలులో స్వామి పట్ల చాలా అమానవనీయంగా వ్యవరించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన తరువాతే ద్రవాలు తాగడానికి ఒక సిప్పర్‌ను స్టాస్ స్వామికి అనుమతించారని గుర్తు చేశారు. 'స్టాన్‌స్వామిపై తప్పుడు కేసులు వేయడం, జైలులో నిర్బంధించడం, అమానవీయ చికిత్సకు కారణమైన వారిపై చర్య తీసుకోవడానికి 'మీ ప్రభుత్వాన్ని' ఆదేశించాలని భారత రాష్ట్రపతిగా మీ తక్షణ జోక్యాన్ని మేము కోరుతున్నాము. వారికి జవాబుదారీతనం ఉండాలి' అని లేఖలో నేతలు పేర్కొన్నారు. అలాగే, భీమా కోరెగావ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వారందరినీ, 'రాజకీయంగా ప్రేరేపిత' కేసుల కింద నిర్బంధించిన వారిని, ఉపా, రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను దుర్వినియోగం చేసి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.