Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి..37మంది పాలకుల్లో ప్రధాని మోడీ
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 142వ ర్యాంక్
- 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను అణచివేస్తున్న దేశాధినేతల్లో ప్రధాని మోడీ ముందు వరుసల్లో ఉన్నారని 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' (ఆర్ఎస్ఎఫ్) విమర్శించింది. తమను విమర్శిస్తున్న మీడియా సంస్థలను, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరించటం, హత్యచేయటం వంటి చర్యలకు పాలకులు పాల్పడుతున్నారనీ, ఈ తరహా పాలకుల్ని 'భక్షకులు' (ప్రిడియేటర్స్) గా ఆర్ఎస్ఎఫ్ అభివర్ణించింది. పోలీసు కేసులతో జర్నలిస్టులను బెదిరించటం, హత్యలు చేయటం..వంటి చర్యలతో పత్రికా స్వేచ్ఛను అణచివేయాలనుకునే నేతల్లో భారత ప్రధాని మోడీ ముందుభాగంలో ఉన్నారని ఆర్ఎస్ఎఫ్ తాజా నివేదిక పేర్కొంది.పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, మయన్మార్ ఆర్మీచీఫ్ మిన్ ఆంగ్ హైంగ్, సౌదీ అరేబియా యువరాజు మహ మ్మద్ బిన్ సల్మాన్...మొదలైన నేతల్ని 'భక్షకు లుగా'గా పేర్కొంటూ, వారి సరసన ప్రధాని మోడీ నిలబడ్డారని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. 180 దేశాలపై రూపొందించిన 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛ' సూచికలో భారత్‌కు 142వ స్థానం దక్కింది. దీనికి సంబం ధించిన మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి..
ఆసియా పసిఫిక్‌లో 13మంది నేతలు
పత్రికా స్వేచ్ఛను తీవ్రంగా అణచివేయాల నుకుంటున్న దేశాధినేతల్ని 'భక్ష కుల'తో పోల్చారు. ఈ గ్రూప్‌లో మొత్తం 37మంది దేశాధినేతలు న్నారు.ఇందులోఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాధినేతలు 13మంది ఉన్నారు. బంగ్లాదేశ్ నాయకురాలు షేక్ హసీనా, హాంకాంగ్ నాయకు రాలు క్యారీ లామ్..'వేటగాళ్ల' జాబితాలో చేరారు. ఈ జాబితాలో చోటుపొందిన ప్రతి దేశాధి నేతకు సంబంధించి ఒక ప్రత్యేక ఫైల్‌ను ఆర్ఎస ్ఎఫ్త యారుచేసింది.ఇందులో 'భక్షకుల' పత్రికా స్వేచ్ఛను ఎలా దెబ్బతీస్తున్నారు? జర్నలిస్టులను ఎలా హత్య చేయిస్తున్నారు? అన్నది కూలంకుశంగా రాశారు.
ప్రధాని మోడీ గురించి..
భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి (మే 26, 2014) నరేంద్రమోడీ పత్రికా సెన్సార్‌షిప్‌కు తెరలేపారు. జాతీయ అతివాదం, తప్పుడు వాగ్దానాల్ని..తీవ్రంగా విమర్శించే పత్రికలు, మీడియా సంస్థలు, అందులోని జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్లను 'వేటాడి..వేధించే' ధోరణి ఎంచుకున్నారు. బడా కార్పొరేట్లతో బలమైన సంబంధాలు కలిగివున్న ప్రధాని మోడీ, ప్రధాన మీడియాను తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. వీటి అండదండతో తనను ప్రశ్నించే మీడియా నోరు మూయించే ఎత్తుగడలు అమలుజేశారు. ఉదాహరణకు అనేక రాష్ట్రాల్లో పలువురు జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు నమోదుచేయించటం సర్వసాధారణమైంది.
ప్రధానిని విమర్శిస్తున్న జర్నలిస్టులపై సామాజిక మాధ్యమంలో మోడీ మద్దతుదారుల దాడులు పెరిగాయి. చంపుతామనీ, లైంగికదాడికి దిగుతామని బెదిరింపులు సైతం వస్తున్నాయి. దేశంలో హిందూత్వ అతివాద పోకడలకు జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య ఒక నిదర్శమని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. మహిళా జర్నలిస్టులు రానా ఆయూబ్, బర్కా దత్‌లపై సామాజిక మాధ్యమంలో మాటలదాడి జరుగుతున్నదనీ, లైంగికదాడి జరుపుతామని ఫోన్‌కాల్స్ కూడా వస్తున్నాయని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది.