Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలని ఎస్కేఎం పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో నానాటికి పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా నేడు (గురువారం) దేశవ్యాప్తంగా ఆందోళనలు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్వహించనున్నది. ఈ ఆందోళనలను జయప్రదం చేయాలని దేశ ప్రజలకు ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. డిజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటల పాటు దేశం అంతటా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆందోళనకారులు తమ స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో సహా రవాణా మార్గాల వెంట నిరసన కోసం ఎంపిక చేసిన బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటారు. నిరసన సమయంలో రహదారులకు ఒక వైపున శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించాలని ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. ఇది సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసే సమస్య, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, దుకాణదారులు, రవాణాదారులు, వ్యాపారులు ఇతరులు ప్రతిచోటా ఈ నిరసనలలో భాగం కావాలని ఎస్కెేఎం విజ్ఞప్తి చేసింది. ధరలను వెంటనే సగానికి తగ్గించాలని డిమాండ్ చేసింది.
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమ బుధవారం నాటికి 223వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం కొనసాగుతుంది. అన్ని సరిహద్దుల వద్ద రైతుల ఉద్యమానికి స్థానిక మద్దతు బలంగా ఉందని అన్నారు.