Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ డార్క్ ఎడిషన్ పేరుతో విజయవంతమైన మోడల్ కార్లకు కొత్త రూపు ఇస్తోంది. తమ వినియోగ దారులను ఆకట్టుకునేందుకు పలు మోడళ్లలో అద్బుత ఫీచర్లతో డార్క్ ఎడిషన్ కార్లను ఆవిష్కరించింది. టాటా మోటార్స్ ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ వేరియంట్లలో డార్క్ ఎడిషన్ కార్లను రూపొందించినట్లు ఆ కంపెనీ బుధవారం తెలిపింది. ఈ వేరియంట్లలో ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద ఆల్ట్రోజ్ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్ ఇవి ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్ ధర రూ. 18.04 లక్షలుగా నిర్ణయించింది. ఆల్ట్రోజ్‌లో డార్క్ ఎడిషన్‌ను ఎక్స్‌జడ్ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. నూతన మోడల్‌ను కాస్మో డార్క్ కలర్ స్కీంతో ఎక్స్టీరియర్ రూపకల్పన చేసింది.