Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్)తో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలకు వేల కోట్లు ఆదా అయ్యాయి. కరోనా సంక్షోభంతో అవసరమైన ప్రయాణాలకే పరిమితం కావడంతో ముఖ్యంగా రవాణపై వ్యయాలు పెద్ద మొత్తంలో తగ్గాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో పలు కంపెనీల రవాణా వ్యయాలు 70 శాతం వరకు తగ్గాయని ఈటీజీటీ డేటాబేస్ వెల్లడించింది. 180 కంపెనీల వివరాలతో ఓ రిపోర్ట్‌ను రూపొందించింది. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టిసిఎస్ 2019-20లో రవాణాపై రూ.3,296 కోట్లను వ్యయం చేయగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చులు రూ.1,081 కోట్లకు తగ్గాయి. దీంతో దాదాపుగా 67 శాతం లేదా రూ.2,215 కోట్లు మిగిలాయి. రిలయన్స్ ఇండిస్టీస్కు కూడా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా వ్యయాలు 70 తగ్గాయి. బజాజ్ ఆటో అయితే ఏకంగా రవాణా వ్యయాల్లో 93 శాతం కలిసి వచ్చాయి. రూ.77 కోట్ల నుంచి రూ.6 కోట్లకు తగ్గించుకుంది.