Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల నిరసన
విశాఖ : విశాఖ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు కావాల్సిన సూచనలు ఇచ్చేందుకు న్యాయ సలహాదారులను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు గాను టెండర్లను కూడా విడుదల చేసింది. న్యాయ సలహాదారులుగా పనిచేయాలకునే సంస్థలు ఈనెల 28 తేదీలోపు బిడ్లు దాఖాలు చేయాలని పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు గురువారం ఉదయం విశాఖ ప్లాంట్ గేటు వద్ద నిరసన తెలిపారు. గేటు వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. న్యాయ సలహాదారు కోసం జారీ చేసిన బిడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కార్మికులు కోరారు.