Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో తొలిడోసుకు దూరంగా 75శాతానికన్నా ఎక్కువ మంది
న్యూఢిల్లీ : వాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికీ 75శాతానికి పైగా ప్రజానీకం తొలిడోసుకు దూరంగా ఉన్నారు. కేవలం 23 శాతం మందికి మాత్రమే తొలిడోసు లభించింది. కేవలం19 శాతానికి మందికి మాత్రమే రెండో డోసు వేశారు. వాక్సినేషన్ ప్రక్రియ జనవరిలో ప్రారంభం కాగా, ఇప్పటివరకు రెరడు డోసులు కలిపి 36 కోట్ల మందికి వాక్సినేషన్ జరిగినట్టు కేంద్రం ప్రకటిరచిరది. ఈ మొత్తంలో 81 శాతం తొలిడోసులే! అంటే కేవలం 19 శాతం మందికే రెండో డోసు వేయగలిగారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చెప్పడానికి ఈ లెక్కలే చాలు!
18+ వారికే ఎక్కువ!
45 ఏళ్లకు పైబడిన వారికన్నా 18+ వారికే ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగినట్టు కేంద్రం తాజాగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 45+ వారికి తొలుత ప్రాధాన్యత ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో కొరత కారణంగా 18సంవత్సరాలు పైబడిన వారికి ఇంకా వ్యాక్సినేష్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. అయితే, కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45 సంవత్సరాలకు పైబడిన వారికి 9.21 కోట్ల మందికి తొలిడోస్ ఇచ్చారు. అదే సమయంలో 18 సంవత్సరాలపైనున్న వారికి 10.63 కోట్ల మందికి తొలిడోసు ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. 45 సంవత్సరాల పైబడిన వారిలో 2.14 కోట్ల మందికి రెండవ డోసు ఇచ్చారు. ఇక 60 ఏండ్లు దాటిన వారికి దేశ వ్యాప్తరగా 6.95 కోట్ల మందికి తొలి డోస్, 2.71 కోట్ల మందికి రెరడో డోస్‌ను వేశారు.