Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పబ్లిక్ అథారిటీ కాకపోయినప్పటికీ పీఎంకేర్స్ ఫండ్‌కు స్త్రశీఙ.ఱఅ డొమైన్‌ను మంజూరు చేయడంపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిరోధించింది. ఆ సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా నియంత్రిస్తోంది. పీఎం కేర్స్ ఫండ్ ఎలా ఏర్పాటైంది? ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లకు కేటాయించే సదరు డొమైన్‌ను ఎలా మంజూరు చేశారు? అన్న విషయంపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు దాఖలైంది. దీంతో ఈ విషయంలో పీఎంఓ ఈ విధంగా వ్యవహరించడం గమనార్హం. గతేడాది ఆగస్టు 5న పీఎంఓ లేఖ ద్వారా పీఎం కేర్స్‌పై సమాచారాన్ని బహిర్గతం చేయకుండా మంత్రిత్వ శాఖను నిరోధించిన విషయం వెల్లడైంది. '' పీఎంకేర్స్ ఫండ్.. ఆర్టీఐ చట్టం jయొక్క సెక్షన్ 2(హెచ్) పరిధి కింద పబ్లిక్ అథారిటీ కాదు. అందువల్ల, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పీఎంకేర్స్ ఫండ్ విషయంలో ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయకపోవచ్చు'' అని ఆ లేఖలో ఉన్నది. అయితే, ఈ లేఖను అనుసరించి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కూడా అప్పీలుదారుకు తెలియజేయడం గమనార్హం.