Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరు పెట్రోల్‌పై 35 పైసల పెంపు
- తాజాగా సీఎన్జీ గ్యాస్‌పై బాదుడు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. చమురు కంపెనీలు గురువారం లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 9 పైసలను పెంచాయి. దీంతో దేశ రాజాధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.56, డీజిల్ ధర రూ.89.62కు చేరింది. వివిధ రాష్ట్రాల్లో చమురు పై విధించే పన్నులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి. అత్యధికంగా బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తాజాగా లీటరు పెట్రోల్ ధర 39 పైసలు, డీజిల్ ధర 15 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.100.62, డీజిల్ ధర రూ.92.65కు చేరింది. గత రెండు నెలల నుంచి చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు తాజాగా చమురు కంపెనీలు సీఎన్జీ, పీఎన్జీ ధరలను సైతం పెంచాయి. దేశరాజధాని ఢిల్లీలో కేజీ సీఎన్జీపై 90 పైసలు, పీఎన్జీపై రూ.1.25 (స్టాండర్డ్ క్యూబిక్ మీటరుకు) పెంచాయి. దీంతో ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ.44.30గా చేరగా, ఎసీఎమ్కు పీఎన్జీ ధర రూ.29.66కు పెరిగింది. అలాగే, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో కిలో సీఎన్జీ ధర రూ.49.98 చేరగా, పీఎన్జీ రూ.29.61కి చేరింది.