Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బ్యాంకింగ్ సంఘాల నిరసనలు
న్యూఢిల్లీ: వ్యవసాయరంగానికీ, గ్రామీణాభివృద్ధికి అత్యధిక రుణాలనందిస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రయివేటీకరించడాన్ని బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రయివేటీకరణ చర్యలను వెనక్కి తీసుకోవాలని జులై 9న దేశవ్యాప్తంగా ఉన్న 43 గ్రామీణ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ), అల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్లు పిలుపు నిచ్చాయి. ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘాలు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి. దేశంలో ఉన్న 43 గ్రామీణ బ్యాంకులు 22000 శాఖలు 90 శాతం వరకు వ్యవసాయ రంగానికీ, ప్రాధాన్యతారంగాలకు, గ్రామీణాభివద్ధికి రుణాలు ఇచ్చి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయని బెఫీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి వెంకటరామయ్య పేర్కొన్నారు. ప్రత్యేక చట్టం ద్వారా 1975 అక్టోబర్ 2న ఇవి ఏర్పాటు చేయబడ్డాయన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించటం కోసం ప్రత్యేకంగా గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి ఆ కమిటి సిఫార్సుల పేరుతో మూలధనంలో 49శాతం వాటాలను అమ్మి, లాభనష్టాల పేరిట విభజించి చివరికి ప్రయివేటుపరం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.d