Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆవు పేడ, మూత్రం వైరస్‌ను అదుపు చేయదని చెప్పినందుకు మణిపూర్‌లో జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఎ) కింద ఇద్దర్ని అరెస్టు చేశారు. ఉద్యమకారుడు ఇరెండ్రో లైచోంబామ్, జర్నలిస్టు కిశోర్‌చంద్ర వాంగ్ఖేమ్ మే 13 నుంచి జైల్లో నిర్భంధంలో ఉన్నారు. ఆవు పేడ, మూత్రం వైరస్‌ను అదుపు చేస్తుందనే బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిరేకించడమే వీరు చేసిన నేరం. మే 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ తికేంద్ర సింగ్ కరోనాతో మరణించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. ఇప్పటికైనా ఆవు మూత్రం వైరస్‌ను నియంత్రిస్తుందనే ప్రచారాన్ని బీజేపీ నేతలు ఆపాలనీ, ప్రజల్ని వైరస్ నుంచి రక్షించాలని ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదే రోజు రాత్రి ఇద్దర్నీ వారీ వారి ఇళ్ల నుంచి పోలీసుల బలవంతంగా తీసుకుని వెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పి ప్రేమచంద మీతై, పార్టీ ఉపాధ్యక్షులు ఉషం దేబన్ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేశారు. వీరి ఇద్దరి విడుదలకు కుటుంబ సభ్యుల న్యాయపోరాటం చేస్తున్నారు.