Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రుణాల జారీలో స్తబ్దత చోటు చేసుకోవడం ఆందోళనకర అంశమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మెన్ దినేష్ ఖార పేర్కొన్నారు. ఇటీవల మాసాల్లో రుణాల వృద్థి ఏకంగా 5.5 శాతం - 6 శాతానికి పడిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణంకాలు పేర్కొంటున్నాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి రెండంకెల రుణ వృద్థిని సాధిం చాలని ఎస్బీఐ నిర్దేశించుకున్న లక్ష్యం నీరుగారింది. దీనిపై ఎస్బీఐ చైర్మెన్ దినేష్ ఖార వ్యాఖ్యానిస్తూ వ్యవస్థలో అత్యంత బలహీనమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కాగా.. లక్ష్యాన్ని చేరడానికి ఆస్తుల నాణ్యత విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ల మొండి బాకీలు 9.8 శాతానికి చేరొచ్చని ఇటీవల ఆర్బీఐ అంచన వేసింది. గతేడాది 7.48 శాతం ఎన్పీఏలు చోటు చేసుకున్నాయి. గతేడాదిలో 15 రంగాల్లోని వెయ్యి లిస్టెడ్ కంపెనీలు బ్యాంక్‌లకు రూ.1.7 లక్షల కోట్ల అప్పులను చెల్లించలేదని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా. ఇదే తరహా పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురు కావొచ్చని ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు.