Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు అన్నదాతలు భారీగా కదులుతున్నారు. కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు.
ఐరాసను ఆశ్రయిస్తాం : రాకేశ్ టికాయత్
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలనాడు ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ అన్నారు. దీనికోసం రైతులు ఐక్య రాజ్య సమితి తలుపు తట్టవలసిరావచ్చునన్నారు. అయితే కొత్త సాగు చట్టాలపై ఐక్య రాజ్య సమితిని ఆశ్రయించడం గురించి ఉద్యమనేతలు మాట్లాడలేదని తెలిపారు. కేవలం జనవరి 26నాటి సంఘటనలపై మాత్రమే చర్చించినట్టు తెలిపారు. కొత్త సాగు చట్టాలకు సంబంధించిన సమస్యను అంతర్జాతీయ వ్యవస్థల వద్దకు తీసుకెళ్ళాలని రైతు ఉద్యమ నేతలు కోరడం లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే, తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 200 మంది రైతులు ఈ నెల 22 నుంచి పార్లమెంటు వద్ద ధర్నా నిర్వహిస్తారని చెప్పారు.