Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజీల్‌పై 26 పైసలు పెంచాయి. గత 68 రోజుల్లో 38 సార్లు ఈ విధంగా ధరలు పెరగడం గమనార్హం. రోజురోజుకూ పెరుగుతున్న ఆయిల్ ధరలు దేశంలోని సామాన్య ప్రజలు, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే, ఈ విధంగా పెరుగుతున్న ధరలను నియంత్రించకుండా అదనంగా తమపై భారం మోపుతున్న మోడీ సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 100.91కు, డీజీల్ ధర రూ. 89.88కు ఎగబాకింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.93కు, డీజీల్ ధర రూ. 97.46కు ఎగబాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.01కి చేరింది. డీజీల్ ధర రూ. 92.97 గా నమోదైంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.67కు చేరింది. డీజల్ ధర రూ. 94.39 గా రికార్డయ్యింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.29కి ఎగబాకింది. డీజీల్ ధర రూ. 95.26 కు చేరి వాహనదారులను షాక్‌కు గురి చేసింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.86కి, డీజీల్ ధర రూ. 97.96 కి పెరిగింది.