Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్షలు వంద రోజులు పూర్తయిన సందర్భంగానూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి కేంద్రం చర్యలు ముమ్మరం చేయడాన్ని నిరసిస్తూ శనివారం విశాఖ నగరంలో మహాప్రదర్శన నిర్వహించారు. పెద్దసంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో ప్రయివేటీకరణ వ్యతిరేక నినాదాలు మారుమోగాయి. వేలాది మంది కార్మికులు విశాఖలోని కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ ఆర్చి నుంచి జీవీఎంసి గాంధీ విగ్రహం వరకు 20 కిలోమీటర్ల పైబడి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వెయ్యి పిడికిళ్లు ఒక్కటి చేసి కేంద్రం మెడలు వంచి విశాఖ ఉక్కును కాపాడుకుంటామని నినాదాలు చేశారు. 'సేవ్ స్టీల్ ప్లాంట్, సేవ్ ఇండియా' అనే నినాదాలున్న గొడుగులు చేతబట్టి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్ జోలికొస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలైనా చేస్తామని కార్మికులు ప్రతినబూనారు. ఈ ర్యాలీ ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎంఎ.గఫూర్, జి.ఓబులేష్, వైసిపి గాజువాక నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడారు.