Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ అత్యంత త్వరగా వ్యాప్తి చెందుతుందనీ, అత్యంత ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందడంతో పాటు నెమ్మదించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా విజృంభణకు దారి తీస్తుందనీ, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. బ్లూమ్‌బర్గ్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ఆఫ్రికాలో గత రెండు వారాల్లో మరణాలు 30-40శాతానికి పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 24 గంటల్లో 5 లక్షల కేసులు నమోదయ్యాయనీ, 9,300 మరణాలు సంభవించాయనీ తెలిపారు. ఈ గణాంకాలనుబట్టీ మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదని అర్థమవుతున్నదని చెప్పారు. కరోనా వైరస్ ఉధృతికి నాలుగు కారణాలను పేర్కొన స్వామినాథన్.. డెల్టా వేరియంట్, గుమిగూడటం, లాక్డౌన్ నిబంధలను సడలించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగిచడం కారణమని చెప్పారు.