Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో కలర్ కోడ్ !
- కొత్తగా వేయికిపైగా మరణాలు
- ఆంక్షల దిశగా పలు రాష్ట్రాలు
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ నియంత్రణతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఢిల్లీలో కరోనా పాజిటివ్ రేట్, కేసుల నమోదు ఆధారంగా ఎల్లో, అంబర్, ఆరెంజ్, రెడ్ హెచ్చరికలు జారీ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ఆంక్షలు కొనసాగుతాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మళ్లీ పెరుగుతోంది. సెకండ్‌వేవ్ తగ్గిందనుకుంటున్న తరుణంలో మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరుగు తుండటం ఆందోళన కలిగి స్తోంది. గత కొన్ని రోజులుగా తక్కువ సంఖ్య లో సంభ విస్తున్న కరోనా మర ణాలు.. తా జాగా వేయికి పైగా నమోదయ్యా యి. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,766 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1,206 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణా లు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసులు 3,07,95, 716కు చేరగా, మర ణాలు 4,07,145కు పెరి గాయి. కొత్తగా 45,254 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆ సంఖ్య 2,99,33, 538కి చేరింది. ప్రస్తుతం 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.20 శాతంగా, పాజిటివిటీ రేటు 2.3 శాతంగా ఉంది. మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. కాగా, ఇప్పటి వరకు మొత్తం 42,90,41,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 19,55,225 శాంప ిళ్లను పరీక్షించి నట్టు తెలిపింది.
అలాగే, మొత్తం 30,55, 802 మంది టీకాలు వేశారు. (పంపిణీ అయిన డోసులు 37 కోట్లకు చేరాయి). కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహా రాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్‌లు టాప్-10లో ఉన్నాయి.
తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు
దేశంలో మళ్లీ కరోనా ప్రభావం పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తు న్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టక పోవడంతో రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు తమిళ నాడు ప్రభు త్వం ప్రకటించింది. ఈ నెల 19 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అయితే, కొన్ని సడలింపులు సైతం ప్రకటించింది.