Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఉమ్మడి వేదిక పిలుపు
న్యూఢిల్లీ : ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ, అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్టార్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్త ఆందోళనలకు కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఉమ్మడి వేదిక పిలుపిచ్చింది. ఈ మేరకు శనివారం పది కేంద్ర కార్మిక సంఘాలు (సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఏఐసీసీటియూ, ఎల్పీఎఫ్, యూటీ యూసీ, ఎస్ఈడబ్ల్యూఏ) స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశం డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్టార్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దూకుడు, తీవ్రమైన పద్ధతులకు వ్యతిరేకంగా ఐదు డిఫెన్స్ ప్రొడక్షన్ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దుతు తెలిపిందని ప్రకటనలో నేతలు పేర్కొన్నారు. రక్షణ సంబంధిత ఉత్పత్తిలో గణనీయమైన భాగం స్వదేశీ, విదేశీ ప్రయివేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు 100 శాతం ఎఫ్‌డీఐ అనుమతించారని విమర్శించారు. ఈ చర్యలన్నీ రక్షణ దళాల అన్ని ప్రాథమిక అవసరాల దేశీయ ఉత్పత్తి నెట్‌వర్క్‌ను తీవ్రంగా బలహీనపరుస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందన్నారు. ఈ దేశ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సంకల్పం, నిబద్ధతతో రక్షణ ఉద్యోగుల సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌లో సమ్మెతో పాటు అన్ని రకాల సామూహిక ప్రజాస్వామ్య నిరసనలు చేసే వారిపై వివిధ కఠినమైన శిక్షలు విధించే నిబంధనలను ఉన్నాయని తెలిపారు. ఆ క్రూరమైన నిరంకుశ చర్యలను ఇతర రంగాలకు విస్తరింపచే యడానికి ఆర్డినెన్స్ ప్రభుత్వానికి అధికారం ఇస్తుం దని వివరించారు. ఇటువంటి దారుణమైన ఆర్డినెన్స్ కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఖండించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికార చర్యలపై ఐక్యంగా పోరాడటానికి, ప్రతిఘటించడానికి దఢ సంకల్పం కార్మిక వర్గం సిద్ధమైందన్నారు.