Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల నమోదు శాతం తక్కువ
- బాలికలు, బాలుర విషయంలో వ్యత్యాసం
- యూడీఐఎస్ఈప్లస్ డేటా
న్యూఢిల్లీ : భారత్లో పాఠశాల విద్యా పరిస్థితులు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులం దరికీ విద్య సమానస్థాయిలో అందడం లేదు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. 2019-20 ఏడాదికి గానూ యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ప్లస్) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
2019-20 ఏడాదిలో 26 కోట్ల మంది పిల్లలు పాఠశాలల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ముందు స్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానంలో ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి.
యూడీఐఎస్ఈప్లస్ సమాచారం ప్రకారం.. భారత్లో 15,07,708 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 10.32 లక్షల పాఠశాలలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. 84,632 పాఠశాలలు ప్రభుత్వ ఏయిడెడ్ కాగా, 3.37 లక్షలకు పైగా అన్ఏయిడెడ్ ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. 53,277 పాఠశాలలను ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి.
ఇక విద్యార్థుల పేర్ల నమోదు ప్రయివేటు ఏయిడెడ్ స్కూళ్లలో 37.13 శాతంగా ఉన్నది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రభుత్వ స్కూళ్లలో 49.5శాతంగా ఉన్నది. ప్రభుత్వ ఏయిడెడ్ స్కూళ్లలో నమోదు ప్రక్రియ 10.4 శాతంగా ఉన్నది. ఇతర పాఠశాలల్లో ఇది మూడు శాతంగా ఉన్నది.
పాఠశాలల్లో నమోదు సంఖ్యలు స్పష్టమైన లింగ అసమానతను చూపిస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్య అధికంగా ఉన్నది. అయితే, ప్రయివేటు, ప్రభుత్వ ఏయిడెడ్ పాఠశాలతో పాటు ఇతర స్కూళ్లలో లింగ అసమానత అధికంగా ఉన్నది. ప్రయివేటు స్కూళ్లలో బాలుర నమోదు 56 శాతంగా ఉన్నది.
అలాగే, ప్రీప్రైమరీ గ్రేడ్స్, ప్రయివేటు స్కూళ్లలో బాలికల కంటే బాలుర సంఖ్యనే అధికంగా ఉన్నదని ఏఎస్ఈఆర్ నివేదిక వెల్లడించింది.
విద్యార్థుల నమోదు ప్రక్రియ అనేది సామాజిక కోణంలోనూ ఆశించిన స్థాయిలో లేదని తేలింది. 2018-19 నుంచి 2019-20 మధ్య నమోదైన గణాంకాల ప్రకారం.. జనరల్ కేటగిరి విద్యార్థుల సంఖ్య 1.26 శాతం పెరిగింది. అయితే, ఓబీసీ ల విషయంలో ఇది 0.69శాతం, ఎస్సీల విషయంలో 0.7 శాతం, ఎస్టీల విషయంలో 0.27శాతంగా ఉండటం గమనార్హం. ఇందులోనూ బాలురతో పోలిస్తే బాలికల నమోదు శాతం తక్కువగా ఉండటం గమనార్హం. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై నిర్లక్ష్యం వహించిందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో జరిపే తక్కువ కేటాయింపులే దీనికి నిదర్శనమని వారు గుర్తు చేశారు.