Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తన రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(ఆర్జిఒ)గా భారత్‌కు చెందిన వినరు ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్ ఈ వివరాలను ఆదివారం తన వెబ్సైట్లో ఉంచింది. అందులోని ఇ మెయిల్ ఐడికి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపవచ్చని పేర్కొంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఐటి నిబంధనల్లోని 4(1)(డి) రూల్ ప్రకారం, ఈ ఏడాది మే 26 నుంచి జూన్ 25 మధ్య కాలానికి సంబంధించి ప్రారంభ నివేదిక (ఇనాగరల్ రిపోర్టు)ను ప్రచురించినట్లు పేర్కొంది.