Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల అక్రమాలను వీడియో తీస్తున్న...
మియాగంజ్ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ సెల్ఫోన్లో వీడియో తీస్తున్న టివి రిపోర్టర్‌ను ఓ ఐఎఎస్ అధికారి వెంటాడి మరీ చితకబాదారు. ఈ ఘటన శనివారం మియాగంజ్‌లో చోటుచేసుకుంది.ఎన్నికలు జరుగుతున్న తీరును వీడియో తీసేందుకు టివి రిపోర్టర్ కృష్ణ తివారీ వెళ్లారు. రిపోర్టర్ సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా... ఉన్నావ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (సిడిఒ) అయిన దివ్యాన్షు పటేల్ వెంటాడి మరీ చితకబాదారు. అక్కడి బిజెపి కార్యకర్తలు కూడా పోలీస్ అధికారితో కలిసి రిపోర్టర్‌ను కొట్టారు. దీన్ని గమనించిన మిగతా పోలీసులు రిపోర్టర్‌ను విడిపించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై బాధిత రిపోర్టర్ కృష్ణ తివారీ మాట్లాడుతూ... ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులు కొందరిని కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తాను వెళ్లానని తెలిపారు. వీడియో తీస్తున్న తనపై దివ్యాన్షు దాడి చేశారని రిపోర్టర్ చెప్పారు. ఘటనపై స్పందించేందుకు ఐఎఎస్ అధికారి దివ్యాన్షు నిరాకరించగా.. ఈ వ్యవహారంపై ఉన్నావ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ... జర్నలిస్ట్‌తో తాను మాట్లాడానని, ఫిర్యాదు స్వీకరించానని, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని హామీ ఇచ్చారు. యుపి వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.