Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గుతూ..పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18,43,500 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,506 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కాస్త తగ్గింది. అంతకుముందు రోజు 1,200 మరణాలు నమోదు కాగా.. తాజాగా 895 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 4,08,040కి చేరింది. అధికారికంగా ప్రకటిస్తున్న మృతులసంఖ్య కన్నా.. ఇప్పటివరకు 25 లక్షలకుపైగా కోవిడ్ బారినపడి చనిపోయినట్టు అనధికారికంగా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి.గడిచిక 24 గంటల్లో 41,526 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,99,75,064కి చేరింది. రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,54,118గా నమోదై.. ఆ రేటు 1.47 శాతానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 37,23,367 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 37,60,32,586కి చేరింది.