Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయాన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నారు. 17 నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 21 వరకూ రోజుకు గరిష్టంగా ఐదు వేల మందికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న వారికి లేదా 48 గంటల్లోపు జారీ చేసిన నెగటివ్ ఆర్టి-పిసిఆర్ పరీక్ష ఉన్న వారికి మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని విజయన్ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా మే నుంచి శబరిమల ఆలయాన్ని మూసివేశారు.