Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను కోరుతూ మోడీ ట్వీట్లు
న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ఎంపికకు పేర్లు సూచించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు.' క్షేత్రస్థాయిలో అసాధారణమైన కృషి చేసే స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు దేశంలో చాలా మంది ఉన్నారని, అయితే వారు పెద్దగా వెలుగులోకి రావడం లేదని మోడీ అన్నారు. అటువంటి ప్రతిభామూర్తులను మేము చూడడం కానీ, వారి గురించి వినడం కానీ తటస్థించదు. అటువంటి స్పూర్తిదాతలు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ప్రజా పద్మ అవార్డులకు వారి పేర్లను మీ ఎంపికగా సూచించవచ్చు' అని ప్రధాని కోరారు. పేర్లను ప్రతిపాదించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉందన్నారు. ఇందుకు సంబంధించిన https://padmaawards.gov.in అనే వెబ్సైట్ లింక్‌ను షేర్ చేశారు. 1954లో ప్రారంభించిన ఈ పద్మ అవార్డులను ప్రతిఏటా గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటిస్తారు.