Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు, ఆదివాసీల గొంతుక, సామాజిక హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మరణం దేశంలో జ్యుడీషియల్ కస్టడీ మరణాలపై పెద్ద చర్చకు తెరలేపింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 1,067 మంది కస్టడీలో మరణించినట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) డేటా సూచిస్తోంది. అంటే దేశంలో నిత్యం దాదాపు ఆరుగురు జ్యుడీషియల్ కస్టడీలో ప్రాణాలు కోల్పోతున్నారని డేటా వెల్లడిస్తోంది. జూన్ 6 నాటికి ఎన్‌హెచ్చార్సీ ముందు 3,003 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జ్యుడీషియల్ కస్టడీలో మరణించిన కేసుల్లో మృతుల కుటుంబాలకు రూ.1.2 కోట్లకు పైగా సిఫారసు చేసింది. జువైనల్ కస్టడీ మరణ కుటుంబానికి రూ.3 లక్షల ఉపశమనం హక్కుగా ప్యానెల్ సిఫారసు చేసింది. ఈ ఏడాది జ్యుడీషియల్ కస్టడీ మరణాలు అత్యధికంగా 263 ఫిబ్రవరి నెలలో నమోదుచేయబడ్డాయి. పోలీసు కస్టడీ మరణాలు అత్యధికం మార్చిలో నమోదుచేయబడ్డాయి. గతేడాది మొత్తం 1,378 మరణాలు నివేదించబడగా.. ఇందులో 83 పోలీసు కస్టడీ మరణాలుండగా, 1295 జ్యుడీషియల్ కస్టడీ మరణాలున్నాయి. ఇంకా 299 కేసులు ఎన్‌హెచ్చార్సీ ముందు పెండింగ్‌లో ఉన్నాయి.