Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు వ్యతిరేకంగా అన్నదాతల నిరసన
- నల్లచట్టాలను వెనక్కితీసుకునే దాక ఉద్యమం: రైతు నేతలు...
న్యూఢిల్లీ . బీజేపీ నేతలకు నల్లచట్టాలకు వ్యతిరేక నిరసనలు తాకుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు..శిఖరాలపై కూడా వినూత్నంగా ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా కార్గిల్ పర్వతశ్రేణులపై రైతు జెండా ఎగురవేసి, మోడీ సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతు దీక్షల్ని చులక చేసి మాట్లాడుతున్న బీజేపీ నేతలను అడ్డుకుంటామనీ, నల్లజెండాలతో శాంతియుత నిరనసలు కొనసాగిస్తామని రైతు నేతలు ప్రకటించారు. కార్గిల్, లడఖ్లలో రైతులు యూనియన్ జెండాను ఎగురవేశారు. రైతుల ఆందో ళన దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటుంది. కార్గిల్, లడఖ్ లోని రైతు సంఘం జెండాను రైతు సంస్థ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఫ్రంట్ ఎగురవేసింది. రైతుల నిరసన దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతానికి కూడా చేరేలా చూసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా కషి చేస్తుంది. పంజాబ్లోని బర్నాలా వద్ద రైతులు ధర్నా చేపట్టారు. రాజస్థాన్లోని గంగానగర్లోనూ, హర్యానాలోని ఫతేహాబాద్ లోనూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. బర్నాలా వద్ద సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో ధనోలాలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. బీజేపీ నేత హర్జీత్ గ్రెవాల్ రైతులను దుర్బాషలాడిన తీరును ఖండించారు. రాజస్థాన్లోని గంగానగర్లో బీజేపీకి చెందిన సూరత్ గఢ్ ఎమ్మెల్యే రామ్ప్రతాప్ కస్నియన్ కూడా పార్టీ కార్యకర్తలతో కలిసి అసభ్యకరమైనభాషను ఉపయోగించారు. దీనికి వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలిపారు. రాంప్రాతాప్ కస్నియన్ ఇంట్లో ధర్నా నిరసన జరుగుతుందని రైతులు ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే వినీతా అహుజా కూడా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందున ఆమెకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. హర్యానాలోని ఫతేహాబాద్లో సిర్సా బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్కు నల్ల జెండాలు నిరసన తెలిపారు. బీజేపీ నాయకులందరినీ శాంతియుతంగా బహిష్కరించే నిర్ణయాన్ని కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు హాజరై.. ఎంపీకి తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. హర్యానాలోని సోనిపట్ నుండి ఘాజీపూర్ సరిహద్దుకు రైతుల భారీ బందం చేరుకుంది. సింఘూ సరిహద్దు వద్ద శనివారం అర్థరాత్రి వినాశకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. అనేక మంది రైతుల గుడారాల తగలబడ్డాయి. చుట్టుపక్కల గుడారాలలో రైతుల సమిష్టి కషి ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో రైతు (సోహన్ సింగ్ (46)) ప్రాణాలు కోల్పోయాడు. వస్తు సామగ్రి పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుడారాల పునర్నిర్మాణానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. రైతు యోధుని విషాదకరమైన ప్రాణ నష్టం గురించి సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేసింది. రైతు కుటుంబానికి తన హదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది.