Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం ఆవాస్ యోజన ప్రచారానికే పరిమితం
- ఆరేండ్లలో 30శాతం ఇండ్ల నిర్మాణం
- కేటాయించిన నిధుల్లో 26శాతం వ్యయం
న్యూఢిల్లీ : పట్టణాలు, నగరాల్లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలు, మధ్య తరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు కల్పించిన కేంద్ర పథకం 'పీఎం ఆవాస్ యోజన'. దేశవ్యాప్తంగా కోటీ 12 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తున్నామని ఘనమైన ప్రచారం చేసుకున్న మోడీ సర్కార్, గత ఆరేండ్లలో సగం ఇండ్లు కూడా కట్టలేకపోయింది. పీఎం ఆవాస్ యోజన (అర్బన్) పథకంలో పక్కా గృహాల నిర్మాణం 30శాతం మాత్రమే జరిగిందని కేంద్ర గృహని ర్మాణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 2022కల్లా పక్కా గృహాన్ని నిర్మించి ఇస్తామని మోడీ సర్కార్ జూన్, 2015లో ఈ పథకాన్ని ప్రారంభిం చింది. దాంతో పథకంపై పేదలు, మధ్య తరగతి కుటుంబాల్లో ఎన్నో ఆశలు కల్పించారు. పథకం ప్రకటన, దాని ప్రచారంలో మోడీ సర్కార్‌కు ఉన్న ఆసక్తి నిధుల వ్యయంలో లేదని విమర్శలున్నాయి. కేంద్ర గృహనిర్మాణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలూ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. గత ఆరేండ్లలో పీఎం ఆవాస్ యోజన అమలు తీరు చూస్తే..నిరాశ, నిస్ప్రహ కలగకమానదు.
అమలు తీరు ఇలా..
గత ఆరేండ్లలో...బస్తీల పునర్నిర్మాణ పథకం 'ఐఎస్ఎస్ఆర్' కింద కేటాయించిన నిధుల్లో వ్యయం 25శాతం, ఏహెచ్‌పీ (అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్షిప్) కేటగిరిలో 26శాతం, బీఎల్సీ (బెనిఫీషియరీ లెడ్ కన్స్ట్రక్షన్) కేటగిరిలో 27శాతం నిధుల వ్యయం జరిగింది. మార్చి 2021 నాటికి ఏహెచ్‌పీ కేటగిరిలో 23,31,229 పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పి..కేవలం 5,16,764 ఇండ్లు కట్టారు. అలాగే బీఎల్సీ కేటగిరిలో 68.69లక్షల పక్కా గృహాలకుగానూ 19.53లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయింది. 'ఐఎస్ఎస్ఆర్' విభాగంలో 4,54,460 ఇండ్ల నిర్మాణ పనులు ఏండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఏ ఒక్కటీ పూర్తికాలేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 18 వేల ఇండ్లు పూర్తయినట్టు కేంద్రం తెలిపింది.