Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 12 ఏళ్లు లేదా ఆ వయస్సు దాటిని వారికి ఇచ్చే జైడస్ కాడిలా కరోనా వ్యాక్సిన్‌కు మరో కొద్ది రోజుల్లో అత్యవసర వినియోగం అనుమతులు లభించనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ధృవీకరించింది. జైడస్ కాడిలా సంస్థకు చెందిన జైకోవి-డి టీకా తొలి దశ, రెండో దశ, మూడో దశ పరీక్షల్లోనూ మంచి ఫలితాలు కనబర్చిందని, ఈ టీకా ప్రస్తుతం విషయ నిపుణుల కమిటీ (ఎస్ఇసి) పరిశీలనలో ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 'అన్ని సవ్యంగా జరిగే.. ఈ టీకా పంపిణీ ఆగష్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది' అని నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) వికె పాల్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. జైకోవి-డి అనేది మూడో డోసుల (0,28, 56వ రోజు) టీకా. దీనిని నిల్వ చేయడానికి మరీ తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం లేదు. 2-8 డిగ్రీల సెల్సియస్‌లోనూ నిల్వ చేయవచ్చు. జైకోవి-డి అత్యవసర వినియోగం కోసం ఈ నెల 1న దరఖాస్తు చేసుకుంది.