Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- నేడు పిటిషన్ దాఖలు
అమరావతి : కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో రిటిపిటిషన్ దాఖలు చేయను న్నట్లు సమాచారం. బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యతని, సాగునీటిని విడుదల చేసేటప్పుడే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలిగానీ, విద్యుత్ కోసం నీటిని వదలకూడదన్న అంశాన్ని పిటీషన్లో పేర్కొన్నట్లు తెలిసింది. సాగు, తాగు అవస రాలు లేకుండా విద్యుత్ కోసం నీటిని విడుదల చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రస్తావించను న్నారు. బచావత్ అవార్డు నుండి ఈ ప్రొటోకాల్‌ను అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయని, దీనికి చట్టబద్ధత కూడా వచ్చిందని, దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరనున్నట్లు తెలిసింది. అలాగే హక్కుగా కేటాయించిన జలాలను దక్కనీయ కుండా విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు విడుదల చేయడం లక్షలమంది రైతుల కనీస అవసరాలకు విఘాతం కలిగించడమేనని పేర్కొ న్నట్లు సమాచారం. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ఆస్తులుగా గుర్తించి నిర్వహణ, భద్ర తలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఈ పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వంకోరనున్నట్లు తెలిసింది. ఈ చర్య వల్ల తరతమ బేధాలు లేకుండా వ్యవహరించే అవకాశం ఉందని సుప్రీం కోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువెళ్లనుంది.