Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20వ తేదీ వరకు గడువు కోరిన 'సీడ్స్' యాజమాన్యం
విశాఖ : విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ అప్పారెల్ సిటీ పరిధిలోని సీడ్స్ ఇంటిమేట్ అప్పారెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న సుమారు రెండు వేల మంది కార్మికులు సోమవారం ఒక్కసారి మెరుపు ఆందోళనకు దిగారు. ఆర్డర్స్ లేక కంపెనీలో పని లేదని, కార్మికులను క్వాంటమ్, బ్రాండిక్స్లోని ఇతర యూనిట్లకు కొత్త ఉద్యోగులుగా బదిలీ చేస్తామని యాజమాన్యం చెప్పడంతో కార్మికులు విధులను బహిష్కరించి కంపెనీ ఎదుట ధర్నా చేశారు. తమ సీనియార్టీని కొనసాగించాలని, ఆరు నెలల జీతం ఇవ్వాలని, బోనస్‌లు, గోల్డ్ కాయిన్, లీవ్ డబ్బులు, పిల్లల స్కాలర్ షిప్‌ల డబ్బులు, సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం బి-షిఫ్ట్ సమయంలో ప్రారంభమైన ఆందోళన రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగింది. చివరికి హెచ్ఆర్ హెడ్ కాళిదాస్ కార్మికులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఈ నెల 20 వరకు గడువు ఇవ్వాలని కోరారు.