Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రజా సమస్యలపై సభ్యులు చర్చకు ముందుకు రావాలనీ, అయితే వెల్ లో ఆందోళన చేయడం మంచి సంకేతం కాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సోమవారం పార్లమెంట్లోని ఎనెక్స్ కాంప్లెక్స్ కమిటీ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు వర్షాకాల సమావేశాల వివరాలు వెల్లడించారు. 19 నుంచి వచ్చే నెల 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. వర్షాకాల సమావేశాలు మొత్తం 19 రోజులు సమావేశాలు ఉంటాయని వివరించారు. కోవిడ్ ఉన్నా... 17వ లోక్సభ మునుపటి లోక్సభలతో పోలిస్తే మొదటి ఐదు సెషన్లలో రికార్డు స్థాయిలో పనిచేసిందని వివరించారు.