Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేసిన రజినీకాంత్
చెన్నయ్ : రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలను ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ పూర్తిగా కొట్టిపారేశారు. తాను భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రానని ఆయన తేల్చిచెప్పేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనే ఉద్దేశంతో 2018లో ప్రారంభించిన రజినీ మక్కల్ మండ్రం(ఆర్ఎంఎం)ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీన్ని అభిమానుల సంక్షేమ సంఘంగా పునరుద్ధరించచనున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఎంఎం నిర్వాహకులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాజకీయ ప్రవేశం, ఆర్ఎంఎఎ రద్దుపై స్పష్టత ఇస్తూ రజినీ ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని పురురుద్ఘాటించిన ఆయన, ఆర్ఎంఎం పరిస్థితి, దాని నిర్వహణపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దీనిలో నిర్వాహకులు, అభిమానుల్లో కూడా గందరగోళం ఉందని అన్నారు. గతంలో రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశంతో అభిమానుల సంక్షేమ సంఘాన్ని ఆర్ఎంఎంగా మార్చానని, అయితే ఇప్పుడు అటువంటిదేమీ లేని నేపథ్యంలో ఆర్ఎంఎంను రద్దు చేస్తున్నానని పేర్కొన్నారు. ఇకపై మునుపటిలాగానే రజినీకాంత్ అభిమానుల సంక్షేమ సంఘం ఎటువంటి అనుబంధ వింగ్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. అంతకుముందు సోమవారం ఉదయం రజినీ తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పిన తర్వాత ఆర్ఎంఎం నిర్వాహకులతో సమావేశం కానుందన, తాజా భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రావడం లేదని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని గతేడాది డిసెంబర్ చివరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.