Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ఉక్కునగరం (విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకొనేం దుకు వచ్చే నెల 2, 3 తేదీల్లో చలో పార్లమెంట్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్, సీఐటీయుూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని వేగవంతం చేసిన నేపథ్యంలో సోమవారం ఉక్కు నగరంలోని సీఐటీయుూ కార్యాలయంలో విలేకరు లతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాసినా, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినా, ఎంపిలు పార్లమెంటులో గగ్గోలు పెట్టినా, 150 రోజులుగా ఉక్కు కార్మికులు పోరా డుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోకుండా ప్రైవేటీకరణ ప్రక్రియను కొనసాగించడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న 20 వేల ఎకరాల భూముల విలువ రూ.2 లక్షల కోట్లుపైబడి ఉంటుందని తెలిపారు. ఈ భూములతో సహా ప్లాంట్ మొత్తాన్ని కేవలం రూ.30 వేల కోట్లకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈ స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ ప్రైవేటీకరణ అని విమర్శించారు. గతంలో విశాఖలోని హిందూస్థాన్ జింక్‌ను ఈ విధంగానే ప్రైవేటీకరణ చేసి ఆ స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుని తీరుతామన్నారు. పోరాట కమిటీ చైర్మన్లు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు అమ్మకంలో భాగంగా ట్రాన్జాక్షన్ అడ్వైజర్, లీగల్ అడ్వైజర్ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 2, 3తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోన్న రాజకీయ పక్షాలు తమ నిరసన గళాన్ని పార్లమెంట్ లోపల, బయట వినిపించాలని, ఈ పోరాటానికి మద్దతు పలకాలని కోరారు. పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లా డుతూ తల్లిలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు అమ్మదల్చుకున్నారని ప్రశ్నించేం దుకు వేలాది మంది కార్మికులు, ప్రజా సంఘాల నాయకులతో ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు. పోరాట కమిటీ కో-కన్వీనర్లు గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ రావు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ పార్లమెంటరీ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఇప్పటికే లేఖలు రాశామని తెలిపారు. ఈ లేఖల సారాంశాన్ని ప్రత్యక్షంగా వివరించి వారి మద్దతు కూడగట్టడం కోసం ఈ నెల 20న ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్తుందని చెప్పారు.