Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రమంతా ఒకేలా కర్ఫ్యూ
- కోవిడ్ సమీక్షలో సిఎం జగన్మోహన్రెడ్డి
అమరావతి : బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగే వారిపై 100 రూపాయలు జరిమానా విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌పై ఆయన సోమవారం క్యాంపు కార్యాల యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెకండ్‌వేవ్ తగ్గిందని చాలా మంది విచ్చలవిడిగా తిరుగేస్తున్నారని చెప్పారు. దుకాణాల్లో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జరిమానాను ఖచ్చితంగా వసూలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. అదే సమయంలో 144వ సెక్షన్ అమలు చేయాలని అన్నారు. రోజూ నమోదయ్యే కేసుల శాతం 5 కంటే తక్కువుగా ఉండటంతోనే ఈ సడలింపులు ఇస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి షాపులను ఎవరైనా నిర్వహిస్తే రెండు మూడు రోజులు వాటిని మూసివేయడంతో పాటు,భారీ జరిమానా విధించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఫోటోలు ఎవరు పంపినా స్పందించాలని, దీనికోసం ఒక వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని చెప్పారు. పాఠశాలు తెరిచే ముందు ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్నారు. డిగ్రీ విద్యార్థులకూ వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని నేరుగా కాలేజీల్లో క్యాంపులు పెట్టి టీకా అందించాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కోవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.