Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాల్సిందే
- రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
విజయవాడ : నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సోమవారం కదంతొక్కారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టరేట్లు, సబ్ కలెక్టరేట్లు, ఐసిడిఎస్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థులకు, అంగన్ వాడీలకు నష్టం కలిగించే 172వ సర్క్యులర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే చర్యలు కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్య మాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.