Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ల సంఖ్య ప్రభుత్వ స్కూళ్లలో చాలా తక్కువ
- యూడీఐఎస్ఈప్లస్ డేటా
న్యూఢిల్లీ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యా యులు కరువయ్యారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యతో పోల్చుకుంటే అందులో బోధించే టీచర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఇక ప్రభుత్వ పాఠశాలలతో పోల్చుకుంటే ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పర్వాలేదనిపించింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈప్లస్) 2019-20 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 96,87,577 మంది టీచర్లు పని చేస్తున్నారు. ఇందులో 49,38,868 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. 8,20,301 మంది టీచర్లు గవర్నమెంట్-ఏయిడెడ్ స్కూళ్లలో పని చేస్తున్నారు. 36,02,625 మంది ఉపాధ్యా యులు ప్రయివేటు స్కూళ్లలో, మిగతవారు ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పాఠశాలల్లో ప్రయివేటు స్కూళ్ల సంఖ్య 22.38 శాతంగా ఉన్నది. వీటిలో 37.18 శాతం మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల సంఖ్య అత్యధికంగా 68.48 శాతంగా ఉన్నది. అయితే, వీటిలో 50.1 శాతం మంది టీచర్లు ఉన్నారు. గవర్నమెంట్-ఎయిడెడ్ స్కూళ్ల సంఖ్య 5.6శాతం కాగా, ఇక్కడ 8.46 శాతం మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇతర పాఠశాలల్లో 3.36శాతం మంది టీచర్లు ఉన్నారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం.. ప్రతి స్కూల్లో చిన్నారి-టీచర్ నిష్పత్తి (పీటీఆర్) 30:1గా ఉండాలి. అయితే,పీటీఆర్ విషయంలో బీహార్ (55.4) చెత్త ప్రదర్శనను కనబర్చింది. కాగా, ప్రాథమిక స్థాయిలో పీటీఆర్ ను ఢిల్లీ (32.7), జార్ఖండ్ (30.6) లు 30 కంటే కాస్త ఎక్కువ కలిగి ఉన్నాయి.