Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం పోలీసులపై నకిలీ ఎన్కౌంటర్ ఆరోపణలు..
- జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
న్యూఢిల్లీ: అసోం పోలీ సులు నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)కు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఆ రాష్ట్ర సీఎంగా హిమంత బిశ్వశర్మ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఇవి మొదలయ్యాయనీ, కస్టడీలో ఉన్నవారినో.. లేదా రైడ్స్ నిర్వహిస్తున్నప్పుడో ఇవి జరుగుతున్నాయనీ, విచక్షణా రహితంగా ఖాకీలు కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోందని న్యాయవాది ఆరీఫ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆదివారం ఒక్క రోజే నాగౌన్‌లో రెండు ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయనీ, జైనల్ అభేదిన్ అనే డెకాయిట్‌ని కాల్చి చంపారన్నారు. ఆ నిందితుడు పలు హత్యాయత్నాలు, దోపిడీలు తదితర నేరాల్లో పేరుమోసిన నేరగాడని పోలీసులు తెలి పారన్నారు. తన సహచరులతో కలిసి ఆ డెకాయిట్ తమపై కాల్పులు జరిపాడనీ, లొంగి పోవలసిందిగా కోరినా విన కుండా పారిపోవడానికి యత్నిం చినప్పుడు తాము ఫైర్ చేశామని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇలా గత 40 రోజుల్లో 20 కాల్పుల ఘటనలు జరిగాయని ఆరీఫ్ తన ఫిర్యాదులో వివరించారు. పశువుల దొంగలు, చిల్లర దొంగతనాలు చేసేవారిని సైతం పోలీసులు కాలుస్తూ.. ఎన్కౌంటర్లో మరణించారని చెబుతున్నారనీ, ముఖ్యంగా మైనారిటీలను వారు తమ టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆరిఫ్ తన ఫిర్యాదులో తెలిపారు. ఇలాంటి ఘటనలు అసోంలో అధికంగా జరుగుతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కస్టడీనుంచి పారిపోతున్న క్రిమినల్స్‌పై పోలీసులు కాల్పులు జరపవచ్చునని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల జరిగిన పోలీసుల సమావేశంలో చెప్పినప్పటి నుంచి ఈ విధమైన నకిలీ ఎన్కౌంటర్లు పెరిగాయనీ, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్చార్సీని ఆయన కోరారు.