Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబినెట్ గ్రీన్‌సిగల్
- ధరపై త్వరలో నిర్ణయం : ప్రభుత్వ వర్గాలు
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీఓ ప్రణాళికను గతవారం క్యాబినెట్ క్లియర్ చేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరం మార్చి లోగా ఎక్స్ఛేంజీలలో ఎల్ఐసీనీ జాబితా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ''ధర, కేంద్రం ద్వారా కేటాయించాల్సిన వాటా పరిమాణంతో సహా ఇతర వివరాలపై మంత్రివర్గ ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుంది'' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబెడెడ్ విలువ, అంతర్గత సామర్థ్యం, ఉత్పత్తి పునర్నిర్మాణంపై ఎల్ఐసీ పని చేస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు చివరి నాటికి ఎల్ఐసీ యొక్క ఎంబెడెడ్ విలువకు యాక్చువల్ సలహాదారులు వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల కొన్ని వార్త సంస్థలు నివేదించిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఎల్ఐసీలో ప్రణాళికబద్ధమైన వాటా అమ్మకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం విదితమే. ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీఓ కనీసం రూ. 1 లక్ష కోట్లు సంపాదించే అవకాశం ఉన్నది. ఇది 2021-22 కేంద్ర బడ్జెట్లో నిర్ణయించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్రతిష్టాత్మక ఉపసంహరణ లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.