Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహ్మదాబాద్ పోలీసుల ఆదేశాలు..
- ఇటీవల ఇలాంటి ఇబ్బందులు మరింత పెరిగాయన్న స్థానికులు
న్యూఢిల్లీ: ''కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. తలుపులు, కిటికీలు మూసివేయండి'' అంటూ గుజరాత్ పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా అహ్మదాబాద్ మూడు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు రోజులలో ఆయన పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వీటిల్లో వెజల్ పూల్ కమ్యునిటీ హాల్ ప్రారంభోత్సవం కూడా ఒకటి. ఆదివారం (11న) అమిత్ షా ఈ కమ్యూ నిటీ హాల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు చుట్టూ ఉన్న ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని ఈ నెల 9న పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించా లనీ, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీ సులు చెప్పినట్టు వెజల్పూర్ వాసులు వెల్లడిం చారు. ఇటీవల అహ్మదాబాద్లో వీవీఐపీ భద్రతల పేరిట ఈ రకమైన ఒత్తిడి మరింత పెరి గిందనీ, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. తనకు ఆస్తమా ఉందనీ, ఇలాంటి సమయంలో ఎలా తాను ఎలా కిటికీలు మూసి ఉంచగలని మీడియాతో ఓ మహిళ అన్నారు. కాగా, దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఇది ఆదేశం కాదు, అభ్యర్థన మాత్రమేనని పేర్కొనడం గమనార్హం.