Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: రాష్ట్రంలోని గర్భిణులకు వ్యాక్సిన్ అందించేందుకు 'మాతృ కవచమ్' పేరుతో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యాక్సిన్ల కోసం గర్భిణీలు ఈ శిబిరంలో తమ పేర్లను ఆశావర్కర్ల ద్వారా నమోదు చేయించుకోవాలని అన్నారు. వారే స్వయంగా రిజిస్టర్ కూడా చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక రోజుల్లో ఈ వ్యాక్సిన్ శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్టు వీణ తెలిపారు. గర్భిణులపై కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతుందనీ, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ... మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రెగెన్సీ సమయంలో వైరస్ బారినపడితే.. డెలివరీ అనంతరం వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఆమె చెప్పారు.