Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : ఆర్టికల్ 311లో సబ్‌క్లాజ్‌ల ప్రకారం 11 మంది ఉద్యోగులను తొలగించడాన్ని జమ్మూకాశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఖండించాయి. తొలగింపు నిర్ణయం ఏకపక్షం, అన్యాయమని ఎన్సీ, పీడీపీ, హరియత్తో సహా అన్ని పార్టీలూ విమర్శించాయి. పీడీపీ అధ్యక్షులు ముఫ్తీ మాట్లాడుతూ 'ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 20 మం దికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఈ విధమైన విధానాలను ఇప్పటికే మే వ్యతిరేకిస్తున్నాం' అని తెలిపారు. జాతీయ భద్రత పేరుతో ఓ ముస్లిం ఉపాధ్యాయురాలిని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. గతంలో ఆమె తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపడంతో.. నష్టపరిహారం కింద జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం రజియా సుల్తానాను టీచర్‌గా నియమించింది. 20 ఏండ్ల అనంతరం ఎటువంటి కారణం, విచారణ లేకుండానే తనను విధుల్లోంచి తొలగించినట్టు రజియా సుల్తానా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.