Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇంటి వద్దకే అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ చార్జీ వసూలు చేయాలని తపాల శాఖ నిర్ణయించింది. పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు కల్పించింది. తాజాగా ఈ ఉచిత సేవలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆగస్టు 1 నుంచి ప్రతీ ఒక్కో సేవకు రూ. 20 వంతున సర్వీస్ చార్జీగా వసూలు చేయనున్నామని తెలిపింది.